Home  »  TV News  »  'కార్తీకదీపం' ట్విస్ట్‌: ప్రియమణి కాదు... పైడమ్మ!

Updated : Jul 16, 2021

 

ప్రియమణి... పేరు అందంగా ఉంది కదూ! 'కార్తీక దీపం'లో ప్రియమణి పాత్రలో నటిస్తున్న శ్రీదివ్య కూడా అందంగానే ఉంటుంది. కనిపించేది పనిమనిషి పాత్రలో అయినప్పటికీ... ఆమెకు అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఆ పేరుకు. అయితే, ప్రియమణి అసలు పేరు పైడమ్మ అని రివీల్ చేయడం 'కార్తీక దీపం' సీరియల్ ప్రేక్షకులకు లేటెస్టుగా తగిలిన షాక్. 

రోజుకొక ఆసక్తికర మలుపుతో 'కార్తీక దీపం' ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సాగుతుంది. ఈమధ్య కార్తీక్ మీద మోనిత కేసు పెట్టిన సంగతి తెలిసిందే. కేసును టేకప్ చేసిన ఏసీపీ రోషిణి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. అందులో భాగంగా మోనిత ఇంట్లో పనిమనిషిగా చేస్తున్న ప్రియమణిని విచారణకు పిలుస్తుంది. అప్పుడు 'నీ  అసలు పేరు చెప్పు?' అని గట్టిగా అడిగేసరికి 'పైడమ్మ' అని చెప్పడంతో ఆడియన్స్ షాక్ అవుతారు.

ఇంటికి వెళ్లి విచారణ సంగతి మోనితకు చెబుతుంది పైడమ్మ. కార్తీక్, దీపకు రోహిణి సపోర్ట్ చేస్తే... తనకు ఎప్పటికీ కార్తీక్ దక్కకుండా పోతాడని మోనిత భయపడుతుంది. సీన్ రివర్స్ కాకుండా తనను కార్తీక్ పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలోనని మథనపడటం మొదలుపెడుతుంది. ఆ త‌ర్వాత ఆమె ఏం చేసిందో చూడాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.